 
															మనోబాలాపై చెప్పుల వర్షం
అన్నాడీఎంకే తరఫున ఆర్కేనగర్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటుడు మనోబాలాకు చేదు అనుభవం ఎదురైంది.
	చెన్నై: అన్నాడీఎంకే తరఫున ఆర్కేనగర్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నటుడు మనోబాలాకు చేదు అనుభవం ఎదురైంది. అతనిపై ప్రజలు చెప్పులు విసిరి కోపాన్ని ప్రదర్శించారు.
	
	సోమవారం ఓపెన్‌జీపులో మనోబాలా వాషర్‌మెన్‌పేటలో ప్రచారం చేస్తున్న సమయంలో మేడపై నుంచి చెప్పులను విసిరేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మనోబాలా ప్రసంగాన్ని ఆపేసి చెప్పులు వేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కేనగర్ నియోజన వర్గం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత పోటీ చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
