కత్తితో సీఎం ఇంటిలో ప్రవేశానికి విఫలయత్నం! | Linga raju arrested in cm camp office in bengaluru | Sakshi
Sakshi News home page

కత్తితో సీఎం ఇంటిలో ప్రవేశానికి విఫలయత్నం!

Nov 3 2015 1:40 PM | Updated on Aug 20 2018 4:44 PM

కత్తితో సీఎం ఇంటిలో ప్రవేశానికి విఫలయత్నం! - Sakshi

కత్తితో సీఎం ఇంటిలో ప్రవేశానికి విఫలయత్నం!

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరిలోకి ఓ వ్యక్తి కత్తితో ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు.

బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరిలోకి ఓ వ్యక్తి నిన్న (సోమవారం)కత్తితో ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. టీ. నరసీపురానికి చెందిన లింగరాజు (54) కొన్ని వ్యాఖ్యలు రాసిన తెల్లకాగితాన్ని పట్టుకుని ‘కావేరి’ముందు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు.

అనుమానం వచ్చిన అక్కడి పోలీసులు అతడిని తనిఖీ చేయగా దుస్తుల లోపల దాచుకున్న కత్తి బయటపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మానసిక అస్వస్థతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కాగా, స్థానిక గ్రేహౌండ్స్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement