రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపిన జయ | Jayalalithaa Greets Tamil Nadu Governor Rosaiah On His Birthday | Sakshi
Sakshi News home page

రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపిన జయ

Jul 4 2016 4:52 PM | Updated on Sep 4 2017 4:07 AM

రోశయ్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన జయ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు.

చెన్నై: తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య(83) కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఒక లేఖను రాశారు. పూల బొకేను రాజ్ భవన్ కు పంపారు.   రోశయ్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన జయ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు. 

రోశయ్య కుమారుడు నారాయణ మూర్తి ఆగస్టు 14 న జరిగే తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా సతీసమేతంగా కలిసి జయను ఆహ్వానించారు. రోశయ్య 1933 జులై 4 న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 2011 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement