విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్‌, ఆత్మహత్య | inter student commits suicide in siddipet district | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్‌, ఆత్మహత్య

Jan 5 2017 12:38 PM | Updated on Sep 5 2017 12:30 AM

ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్‌ చితకబాదడంతో మనస్తాపానికి గురైన ఆమె భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

సిద్దిపేట: తోటి విద్యార్థిని డబ్బులు తీసుకుందనే నెపంతో అందరి ముందు ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్‌ చితకబాదడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన భవాని(17) పట్టణంలోని సాయి చైతన్య కళాశాలలో ఇంటర్‌ సీఈసీ) చదువుతోంది. రోజులాగే ఈ రోజు కళాశాలకు వచ్చిన భవానికి తరగతి గదిలో అవమానం జరిగింది.
 
తోటి విద్యార్థిని పోగొట్టుకున్న వంద రూపాయలు భవాని బ్యాగులో లభించడంతో.. కళాశాల ప్రిన్సిపల్‌ బ్రహ్మానందరెడ్డి(నందు) ఆమెను తీవ్రంగా కొట్టాడు. తరగతి గదిలోని విద్యార్థులంతా చూస్తుండగా ఆమెను దండించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన భవాని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement