కొత్తదారి..1,2,3... స్టార్ట్‌! | Ramini Madhu runs Whatnxt career service in Siddipet. | Sakshi
Sakshi News home page

కొత్తదారి..1,2,3... స్టార్ట్‌!

May 22 2026 5:33 PM | Updated on May 22 2026 6:16 PM

Ramini Madhu runs Whatnxt career service in Siddipet.

బిజినెస్‌ ఐడియా ఉన్నప్పటికీ  పెట్టేందుకు పెట్టుబడి లేదు. డబ్బులు ఉన్నాయి, ఎలాంటి బిజినెస్‌ పెడితే సక్సెస్‌ అవుతాం?  ఒక బిజినెస్‌ను స్టార్ట్‌ చేశాం దానిని ఎలా ముందుకు తీసుకు΄ోవాలి? అని తర్జన భర్జన చెందుతుంటారు. ఇలాంటి వారి కోసమే ‘సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ’ పేరుతో ఒక వేదికను సిద్దిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఏర్పాటు చేశారు. చిన్నకోడూరుకు చెందిన రామిని మధు సిద్దిపేటలో  కెరీర్‌ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాడు. సిద్దిపేటకు చెందిన ఆచి విజయ్‌ ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు...

వాక్‌ అండ్‌ టాక్‌
సిద్దిపేట పట్టణంలో ‘సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ’ ఆధ్వర్యంలో వాక్‌ అండ్‌ టాక్‌ కార్యాక్రమాన్ని చేపట్టారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునేవారికి ఎలాంటి కంపెనీ ప్రారంభిస్తే సక్సెస్‌ అవుతారో ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లు, వివిధ రంగాల నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 

ముగ్గురికి ఉచితంగా ప్రమోషన్‌
ప్రతీ వారం హాజరైన వారిలో నుంచి ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రమోషన్‌  చేస్తున్నారు. వారి స్టార్టప్‌లకు ఉచితంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేటకు చెందిన నాగహర్ష  సిద్దిపేట క్విక్‌ డెలివరీ యాప్‌ తయారీకి ఇన్వెస్టర్‌గా ముందుకువచ్చాడు. అరవింద్‌ రెడ్డి వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నాడు. నిర్వాన్‌  ఆర్గానిక్‌ ఫాం ద్వారా మార్కెట్‌లోకి వచ్చేందుకు అవకాశం లభించింది. సిద్దిపేట పట్టణానికి చెందిన భవాని అబాకస్‌ శిక్షణ ఇచ్చేవారు. ఈ కమ్యూనిటీ ద్వారా ఎక్స్‌ ఎల్‌ అబాకస్‌ వారి ్ర΄ాంఛైజీ లభించింది. ‘వాక్‌ అండ్‌ టాక్‌’ కార్యక్రమం ఇస్తున్న ఫలితాలకు ఇవి కొన్ని ఉదాహరణలు.

ఆలోచన ఉంటే డబ్బు ఉండదు...  డబ్బు ఉంటే ఆలోచన ఉండదు
ప్రతి ఒక్కరికీ బిజినెస్‌ చేయాలని ఉంటుంది. కానీ వారికి ఇన్వెస్ట్‌ చేసేంత డబ్బు ఉండదు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండి సరిౖయెన ఫ్లాట్‌ఫాం ఉండదు. ఈ నేపథ్యంలోనే యువతకు గైడెన్స్‌ ఇవ్వాలని సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీకి శ్రీకారం చూట్టాం. మా కమ్యూనిటీ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మా ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.
– మధు, విజయ్‌

– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement