ప్రాణం తీసిన మొబైల్ వ్యసనం | husband kills wife's over mobile phone addiction | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మొబైల్ వ్యసనం

Sep 9 2014 8:14 AM | Updated on Jul 30 2018 8:29 PM

ప్రాణం తీసిన మొబైల్ వ్యసనం - Sakshi

ప్రాణం తీసిన మొబైల్ వ్యసనం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే క్రమంలో కొంత విచక్షణ ఉండాలి. అది మనకు ఎంత వరకు ఉపయోగకరమో అంతవరకే దానిని వినియోగించుకోవాలి.

   *  శ్రుతిమించిన  సంభాషణలతో నిత్యం దంపతుల మధ్య గొడవ
   *   భార్యను హత్య చేసిన భర్త
    *  అలవాటు మార్చుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్న వివాహిత
   *  నిందితుడి అరెస్ట్

బెంగళూరు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే క్రమంలో కొంత విచక్షణ ఉండాలి. అది మనకు ఎంత వరకు ఉపయోగకరమో అంతవరకే దానిని వినియోగించుకోవాలి. శ్రుతి మించితే ఎంతటి అనర్థానికైనా దారితీస్తాయన డానికి ఇదో ఉదాహరణ. తరచూ గంటల తరబడి భార్య మొబైల్లో మాట్లాడటం సహించని భర్త ఆమెను హత్య చేసిన సంఘటన ఇక్కడి ఇక్కడి రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాదగిరికి చెందిన రేణుకా (20) ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ఈమె భర్త సైమన్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సోమవారం పోలీసులు చెప్పారు.

వివరాలు... ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండే సైమన్, రేణుకా ప్రేమ వివాహం చేసుకున్నారు. అన ంతరం బెంగళూరు చేరుకుని రాజగోపాలనగరలోని సంజీవిని నగరలో నివాసం ఉంటున్నారు. సైమన్ ఇక్కడి ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఇదిలా ఉంటే మొబైల్లో మాట్లాడటమే వ్యసనంగా మారడంతో తరచూ రేణుకను సైమన్ హెచ్చరించేవాడు.

భార్యకు ఎప్పుడు ఫోన్ చేసిన కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. గంటల తరబడి సంభాషిస్తుండటంతో తరచూ భర్త అసహనానికి గురయ్యేవాడు. ఈ విషయంపై భర్తకు సరైన సమాధానం ఇచ్చేది కాదు. ఇదే విషయంలో గత నెల నుంచి దంపతుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి దంపతులు గొడవపడ్డారు.

ఆ సమయంలో సహనం కోల్పోయిన సైమన్ కత్తి తీసుకుని భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పరిలించిమతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బంధువు ఇంటిలో తలదాచుకున్న సైమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని సోమవారం పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement