వరల్డ్ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ప్రాక్టో మరింతగా ఆరోగ్య సేవలను
ప్రాక్టో వ్యవస్థాపకులు శశాంక్ వెల్లడి
కొరుక్కుపేట: వరల్డ్ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ప్రాక్టో మరింతగా ఆరోగ్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఆసంస్థ వ్యవస్థాపకులు శశాంక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధ తీసుకునేలా ప్రాక్టో సరికొత్తవిధానంలోనే ఆరోగ్య సేవలను కల్పిస్తుందని తెలిపారు.
ఇప్పటికే వెబ్, ఎం-వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ద్వారా ఆరోగ్య సూచనలు అందిస్తున్నామని అన్నారు.ప్రస్తుతం ట్విట్టర్ ద్వారా హెల్త్ కేర్ సూచనలు అందిస్తున్నామని తెలిపారు.ట్విట్టర్‌లో అడిగే ఆరోగ్య సమస్యల ప్రశ్నలకు తమ వైద్యులు సరైన ఆరోగ్య సమాచారాన్ని కల్పిస్తుందని వివరించారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కోన్నారు.