తెరపైకి నాచ్చియప్పన్ తనయుడు


శివగంగైలో ఆధిపత్యం కోసం కేంద్ర మంత్రులు చిదంబరం, సుదర్శనం నాచ్చియప్పన్ మధ్య పోరు తీవ్రమవుతోంది. చిదంబరం గ్రూపునకు చెక్ పెట్టడం లక్ష్యంగా నాచ్చియప్పన్ పావులు కదుపుతున్నారు. అదే సమయంలో చిదంబరం వర్గం దీటుగా బదులిస్తోంది. ఈ ఆధిపత్య పోరు రాష్ట్ర కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. 

 

 సాక్షి, చెన్నై: గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న గ్రూపులు మరే ఇతర పార్టీ ల్లో కనిపించవు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జి.కె.వాసన్ గ్రూపులను ప్రధానంగా తీసుకోవచ్చు. తాజాగా కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ గ్రూపు తెర మీదకు వచ్చింది. ఈ గ్రూపు శివగంగైలో ఆధిపత్యం చాటుకునే పనిలో ఉంది. గతంలో శివగంగై నుంచి లోక్‌సభకు నాచ్చియప్పన్ ఎన్నికయ్యూరు. గత ఎన్నికల్లో చిదంబరం కోసం సీటును త్యాగం చేయా ల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య చాప కింద నీరులా వివాదం నడుస్తోంది.

 

 వివాదం: ఢిల్లీలో తనకున్న పలుకుబడితో రాజ్యసభ సీటును రెండుసార్లు నాచ్చియప్పన్ దక్కించుకున్నారు. ఏదో ఒక రోజు చిదంబరానికి నియోజకవర్గంలో చెక్‌పెట్టి ఆ సీటును మళ్లీ తన్నుకెళ్లాలన్న వ్యూహంతో ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడానికి చిదంబరం ప్రయత్నిస్తున్నారంటూ నాచియప్పన్ పలుమార్లు అధిష్టానానికి ఫిర్యా దు చేశారు. నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నియోజకవర్గానికి చిదంబరం వస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న నాచ్చియప్పన్ తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. తన తనయుడు జయసింహాను తెరపైకి తీసుకొచ్చారు. అభివృద్ధిపరంగా వెనుకబడ్డ నియోజకవర్గంలో కేంద్ర పథకాల్ని అమలు చేయించే పనిలో ఉన్నారు. మంత్రి హోదాలో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు చిదంబరం వర్గానికి మింగుడు పడడం లేదు.

 

 సై అంటే సై: కయ్యూనికి కాలు దువ్వే రీతిలో జయసింహ చేస్తున్న వ్యాఖ్యలతో శివగంగైలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆసక్తిగా మారింది. తామేమీ తక్కువ కాదన్నట్లు చిదంబరం వర్గం ఎదురుదాడికి దిగుతోంది. తమ వర్గానికి చెక్ పెట్టేందుకు నాచ్చియప్పన్ వేగంగా పావులు కదుపుతున్న సమాచారం చిదంబరం దృష్టికి చేరింది. నాచ్చియప్పన్ మద్దతుదారులు మాట్లాడుతూ తమ నేత గుప్పెట్లో ఉన్న నియోజకవర్గాన్ని చిదంబరం లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి పెట్టని ఆయనకు మళ్లీ సీటు ఇవ్వకూడదన్న నినాదంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు. 

 

 చిదంబరం గత ఎన్నికల్లోనే ఓటమి అంచుల్లోకి వెళ్లారని, ఈ పర్యాయం సీటు ఇస్తే ఓటమి తప్పదని పేర్కొన్నారు. చిదంబరం మద్దతుదారులు మాట్లాడుతూ మంత్రి పదవి దక్కడంతో తానే దో గొప్ప నాయకుడైనట్లుగా నాచ్చియప్పన్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేస్తున్నారు. తమ నేతను కాదని మరొకరికి శివగంగై సీటు దక్కదని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రూపులు బహిరంగంగానే వివాదాలకు దిగుతుండడంపై సత్యమూర్తి భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయం)కు ఫిర్యాదులు వెళ్లారుు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top