‘రాజన్న’పైనే ఆశలన్నీ..! | four line bridge on moolavagu | Sakshi
Sakshi News home page

‘రాజన్న’పైనే ఆశలన్నీ..!

Oct 15 2016 1:08 PM | Updated on Sep 4 2017 5:19 PM

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఎములాడ రాజన్న క్షేత్రానికి చేరుకునేందుకు మూలవాగుపై ఇప్పటి వరకు ఒకే ఒక్క వంతెన ఉంది.

   మూలవాగుపై ఫోర్‌లేన్ వంతెన
   బ్రిడ్జి నిర్మాణానికి రూ.28కోట్లు
   భక్తులకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
   జిల్లా ఏర్పాటుతో పనులు వేగవంతంపై ఆశలు
 
వేములవాడ : నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఎములాడ రాజన్న క్షేత్రానికి చేరుకునేందుకు మూలవాగుపై ఇప్పటి వరకు ఒకే ఒక్క వంతెన ఉంది. అదికూడా ఇరుకవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తెతున్నా రుు. భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం రూ.28 కోట్ల వ్యయంతో ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గత డిసెంబర్ 19న వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు వేగవంతంగా జరిగేందుకు కొత్త డిజైన్ రూపొందించినట్లు ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు మంత్రి తెలిపారు. ఫోర్‌లేన్‌తోపాటు నందికమాన్- తిప్పాపూర్, వేములవాడ పట్టణ మొదటి, రెండో బైపాస్‌రోడ్లు సైతం ఫోర్‌లైన్లుగా మార్చతున్నట్లు ప్రకటించా రు. బైపాస్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నా, వంతెన పనులు ముందుకు సాగడం లేదు. 
 
తరచూ ట్రాఫిక్ సమస్యలు..
శంకుస్థాపన చేసి దాదాపు పదినెలలైనా పనులు ముం దుకు సాగడం లేదు. ఫలితంగా ప్రత్యేక పర్వదినాలు, సెలవుల్లో వచ్చే వేలాది మంది భక్తులు వంతెనపై ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆందోళనకారులు ధర్నా, రాస్తారోకోలు చేసిన సమయయూల్లో వాహనాలు స్తంభించి భక్తులకు చుక్కలు కనిపిస్తున్నారుు. అయితే రెండో బైపాస్‌రోడ్డు పనులు కొనసాగుతుండగా, బ్రిడ్జి పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాతోనైనా అధికారులు స్పందించి పనులు త్వరితగతిన చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
 
రద్దీని ఇలా తగ్గించవచ్చు..
మూలవాగులోని బతుకమ్మతెప్ప వద్ద తాత్కాలిక వంతెన నిర్మించాలి.
ట్రాఫిక్‌ను అటు మళ్లిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
వంతెన ప్రాంతం, అమరవీరుల స్తూపం వద్ద ధర్నాలు, రాస్తారోకోలను నిషేధించాలి.
వంతెనపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాలి.
వాహనాల రద్దీ సమయూల్లో నందికమాన్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లించి వన్‌వే ఏర్పాటు చేయూలి.
 
టెండరు ప్రక్రియ పూర్తి
మూలవాగుపై ఫోర్‌లేన్ వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తరుుంది. బ్రిడ్జి డిజైన్‌లో మార్పు కోసం ఢిల్లీకి పంపించాం. అక్కడి నుంచి రాగానే పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.14 కోట్లు వెచ్చించి వంతెన నిర్మిస్తాం. మిగతా సొమ్ము భూసేకరణకు వెచ్చిస్తాం. ప్రత్యేక జిల్లా ఏర్పడినందున పనులు ఈనెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది.
 -రాజమౌళి, ఏఈ, ఆర్‌అండ్‌బీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement