వరదలో చిక్కుకున్న జాలర్లు క్షేమం | fishermen who Flood trapped in the came out safely | Sakshi
Sakshi News home page

వరదలో చిక్కుకున్న జాలర్లు క్షేమం

Oct 3 2016 11:14 AM | Updated on Aug 17 2018 2:56 PM

గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు జాలర్లు క్షేమంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు జాలర్లు క్షేమంగా ఉన్నారని, వారిని మరికొంతసేపట్లో రక్షించి ఒడ్డుకు తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. వివరాలివీ.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ధర్మాజీ రాజేష్(28), కూనారపు సంతోష్(30) మరికొందరితో కలసి గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం వరకు మిగతా వారంతా తిరుగుముఖం పట్టగా.. వీరిద్దరూ ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. ఒడ్డుకు చేరేందుకు వీలుకాక రాత్రంతా నీటిలోనే గడిపారు. సోమవారం ఉదయం తోటి వారితో కలిసి సమీప గ్రామస్థులు రక్షించేందుకు యత్నించినా వీలుకాలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. రామగుండం ఏఎస్పీ విష్ణు వారియర్, కలెక్టర్ జగన్‌మోహన్, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల సాయంతో ఎన్టీఆర్ ఎఫ్‌ను అప్రమత్తం చేశారు. కొద్దిసేపట్లోనే ఎన్టీఆర్‌ఎఫ్ దళాలు అక్కడికి చేరుకుని బోటు ద్వారా వారిని రక్షిస్తాయని అధికారులు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement