’ఎదుర్కోలేక నాపై బురద జల్లుతున్నారు’ | farmer minister sridhar babu slams putta madhu over link with Gangster Nayeem | Sakshi
Sakshi News home page

’ఎదుర్కోలేక నాపై బురద జల్లుతున్నారు’

Oct 25 2016 2:35 PM | Updated on Sep 4 2017 6:17 PM

’ఎదుర్కోలేక నాపై బురద జల్లుతున్నారు’

’ఎదుర్కోలేక నాపై బురద జల్లుతున్నారు’

రాజకీయ లబ్ధి కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

-మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
 
హైదరాబాద్‌: ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..గ్యాంగ్‌స్టర్ నయీంతో నాకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు.. నయీం కేసును  సీబీఐకి అప్పగించేలా సీఎం కేసీఆర్ ను కోరాలన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
 
కాగా గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని పుట్ట మధు ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement