వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు కిందికి వేలాడుతున్నవిద్యుత్ తీగలు తాకి మృతి చెందాడు.
విద్యుదాఘాతానికి రైతు బలి
Mar 9 2017 12:15 PM | Updated on Oct 1 2018 4:01 PM
గండీడ్: వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు కిందికి వేలాడుతున్నవిద్యుత్ తీగలు తాకి మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రైతు ఈడిగి వెంకటయ్య(55) ఈ రోజు పొలం వద్ద పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మృతిడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడని.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement


