విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 9 2016 11:11 AM | Updated on Oct 1 2018 4:01 PM

మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో  కరెంట్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement