ధనుష్ సరసన కీర్తి సురేష్? | Dhanush to romance Keerthi Suresh | Sakshi
Sakshi News home page

ధనుష్ సరసన కీర్తి సురేష్?

Jun 6 2015 1:43 AM | Updated on Sep 3 2017 3:16 AM

ధనుష్ సరసన కీర్తి సురేష్?

ధనుష్ సరసన కీర్తి సురేష్?

మలయాళి బ్యూటీస్ హవా కోలీవుడ్‌లో కొనసాగుతునే ఉంది. అలాగే యువ తారల దిగుమతి అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

మలయాళి బ్యూటీస్ హవా కోలీవుడ్‌లో కొనసాగుతునే ఉంది. అలాగే యువ తారల దిగుమతి అప్రతిహతంగా సాగుతూనే ఉంది. అమలాపాల్, లక్ష్మీమీనన్‌ల తరువాత కేరళ భామ కీర్తి సురేష్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటి మేనకకు వారసురాలైన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో శివకార్తికేయన్ సరసన రజని మురుగన్, విక్రమ్ ప్రభుకు జంటగా ఇదు ఎన్న మాయం చిత్రాల్లో నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.
 
 అయితే ఈ చిత్రాల రిలీజ్‌కు ముందే కీర్తి సురేష్ మరో భారీ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తాజా సమాచారం. శివకార్తికేయన్, విక్రమ్ ప్రభు లాంటి యువ హీరోలతో నటించిన ఈ మలయాళి బ్యూటీకి మూడవ చిత్రంతోనే ధనుష్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రంలో నటిస్తున్న ధనుష్ తదుపరి ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ దర్శకుడు ధనుష్ కోసం వైవిధ్యభరిత కథను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement