నగరంలోని 180 పోలీస్‌స్టేషన్లకు త్వరలో టయోటా ఇన్నోవా కార్లు రానున్నాయి. దీంతో ఇప్పటిదాకా వినియోగించిన జిప్సీ కార్లను పక్కనపెట్టనున్నారు. బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: నగరంలోని 180 పోలీస్‌స్టేషన్లకు త్వరలో టయోటా ఇన్నోవా కార్లు రానున్నాయి. దీంతో ఇప్పటిదాకా వినియోగించిన జిప్సీ కార్లను పక్కనపెట్టనున్నారు. బహుళ ప్రయోజనాలు కలి గిన దాదాపు 600 వాహనాలను ఢిల్లీ పోలీసులు గస్తీ కోసం వినియోగిస్తున్న సంగతి విదితమే. తాజాగా జిప్సీల స్థానంలో ఇన్నోవా కార్లను గస్తీ కోసం వినియోగించనున్నారు. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఇన్నోవా కారును మంజూరు చేయాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి గతంలో విన్నవించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆమోదం కోసం పంపించాయి. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ఆది వారం వెల్లడించాయి.
తమ పరిధిలోని ప్రాంతాల్లో గస్తీతోపాటు ఇతర అవసరాల కోసం స్టేషన్ హౌస్ అధికారులు (ఎస్‌హెచ్‌ఓ) ప్రస్తుతం తెల్లరంగు జిప్సీ వాహనాలను వినియోగిస్తున్న సంగతి విదితమే. నగరవ్యాప్తంగా ఉన్న 180 పోలీస్ స్టేషన్‌లలో మొత్తం 60 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయమై ఓ అధికారి మాట్లాడుతూ ఇన్నోవాలు తమకు వరంగా మారతాయని, ఒక్కొక్క ఇన్నోవాలో పది మంది సిబ్బంది కూర్చోగలుగుతారని అన్నారు. గమ్యానికి సత్వరమే చేరుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. కాగా ఇన్నోవా వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ జిప్సీ వాహనాలను మూలనపడేయబోమని, వాటిని వినియోగిస్తూనే ఉంటామని మరో అధికారి తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు వీటిని కర్తవ్య నిర్వహణలో భాగంగా వినియోగిస్తారని తెలిపారు. ఇన్‌స్పెక్టర్ కంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నతాధికారి ఎస్‌హెచ్‌ఓ. ఒక్కొక్క పోలీస్‌స్టేషన్‌లో ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందిన అధికారికూడా బాధ్యతలను నిర్వరిస్తాడు. ఎస్‌హెచ్‌ఓ విధులకు రానప్పు డు ఆయన బాధ్యతలను ఆయా ఇన్‌స్పెక్టర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో అదనంగా మరో రెండు జిప్సీలు ఉంటాయి. వీటి లో ఒకదానిని సత్వర స్పందన బృందం (క్యూఆర్‌టీ) వినియోగిస్తుంది. ఇక మరోదానిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనంగా వినియోగిస్తారు. సాధారణంగా ఎక్కడైనా నేరం జరిగితే అక్కడికి వెళ్లాలంటూ ఆదేశాలొచ్చినప్పుడు సిబ్బంది తమ సొంత వాహనాలనే వినియోగిస్తుంటారు. అయితే ఇకపై ఆ అవసరం ఉండదు. ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వీరు వినియోగించుకోవచ్చు.


