చైన్‌స్నాచర్లూ.. మారాలి మీరు

Constable Song Viral In Social Media karnataka - Sakshi

కర్ణాటక, బొమ్మనహళ్లి: ఆ పోలీసు గస్తీ కాయడం, దొంగలను పట్టుకోవడం వంటి విధులతోనే ఊరుకోలేదు. తన బుర్రకు, గొంతుకు పనిచెప్పి ఓ పాటను వదిలాడు. ఇక అంతే. జనంలో ఓ హీరో అయ్యాడు. బెంగళూరు నగరంలో ప్రతి రోజూ చైన్‌ స్నాచింగ్‌లతో మహిళలు బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఒంటరి మహిళలు, వృద్ధులపై చైన్‌స్నాచర్లు తెగబడుతున్న దారుణాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీస్‌ కానిస్టేబుల్‌ స్వయంగా పాడి రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆదరణ చూరగొంటోంది. బయ్యప్పనహళ్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్య.. చైన్‌స్నాచింగ్‌ల వల్ల మహిళలకు కలుగులుతున్న ఇబ్బందులు, సమాజంలో చోటు చేసున్న భయానక వాతావరణం, చైన్‌స్నాచింగ్‌లను అడ్డుకట్ట వేయడానికి అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ స్వయంగా పాటపాడి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

హేమంత్‌ సంగీత దానం  
ఆయన ఉడతాభక్తి సేవను గుర్తించిన శాండల్‌ ఉడ్‌ సంగీత దర్శకుడు హేమంత్‌ పాటకు సంగీతం సమకూర్చారు. ఈ పాటకు య్యూటూబ్‌లో లక్షల మంది చూశారు, దీంతో సుబ్రహ్మణ్య పాటను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కూడా అప్‌లోడ్‌ చేశారు. మరింత వైరల్‌గా మారడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌కుమార్‌.. సుబ్రహ్మణ్యను అభినందించి నగదు బహుమానంతో సత్కరించారు. 

సంతోషంగా ఉంది  
‘చైన్‌స్నాచింగ్‌ల వల్ల మహిళలు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించి ఇకపై చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడవద్దంటూ చైన్‌స్నాచర్లకు సూచించా. ఇంత స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉంది’.  –సుబ్రహ్మణ్య, కానిస్టేబుల్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top