దసరా తర్వాతేస్పష్టత | Congress seeks more Lok Sabha seats, irks NCP | Sakshi
Sakshi News home page

దసరా తర్వాతేస్పష్టత

Sep 23 2013 12:19 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నా కాంగ్రెస్, ఎన్సీపీలు ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇంకా ఓ స్పష్టతకు రాలే దు.

సాక్షి, ముంబై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నా కాంగ్రెస్, ఎన్సీపీలు ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇంకా ఓ స్పష్టతకు రాలే దు. పాత ఫార్ములా (26-22) ప్రకారమే పోటీ చేస్తామని ఎన్సీపీ పదేపదే చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం సానుకూల వైఖరి మాత్రం కనబడటం లేదు. తొందరగా సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి చేసుకోవాలనుకున్న ఇరు పార్టీలు ఆ విషయమై ఇప్పటివరకు చర్చించిన దాఖలాలు కనబడటం లేదు. దీనికితోడు పితృపక్షాలు ప్రారంభం కావడంతో సీట్ల పంపకాల చర్చలు దసరా తర్వాతే ఉండొచ్చని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నా రు.
 
 రెండు నెలల క్రితమే ఎన్సీపీ నాయకులు పాత ఫార్మూలతోనే(26-22) పోటీచేయనున్నామని ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం కొత్త ఫార్మూలాతో పోటీ చేయాలని భావిస్తోంది. తమ బలం పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్ 29 స్థానాల్లో పోటీ చేసి, ఎన్సీపీకి 19 స్థానాలను ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో 26-22, 29-19 ఈ రెండు ఫార్ములాలో దేనిపై సయోధ్య కుదురనుంద నే విషయమై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు దీనిపై వీరి మధ్య సయోధ్య కుదరలేదు. కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 స్థానాల్లో పాత ఫార్ములాతోనే లోక్‌సభ బరిలోకి దిగుతామని ఎన్సీపీ సీనియ ర్ నాయకుడు ప్రఫుల్ పటేల్‌తోపాటు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ ప్రకటించి న విషయం విదితమే. అయితే ఈ విషయాన్ని ముందు నుంచి ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ఖండిస్తూ వస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement