ఎమ్మెల‍్యే ఆర్కే రోజాను ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్ నేత మల్లాది విష‍్ణు పేర‍్కొన్నారు.
రోజాను అడ్డుకోవడం అప్రజాస్వామికం: కాంగ్రెస్
Feb 13 2017 12:57 PM | Updated on Oct 29 2018 8:10 PM
విజయవాడ: మహిళా పార‍్లమెంట్ సభ‍్యుల సదస్సుకు హాజరయ‍్యేందుకు వెళుతున‍్నఎమ్మెల‍్యే ఆర్కే రోజాను ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం దారుణమని, అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత మల్లాది విష‍్ణు, కె. శివాజి పేర‍్కొన్నారు. సోమవారం ఉదయం వారిక‍్కడ మీడియాతో మాట్లాడుతూ రోజాను అడ్డుకోవడం మహిళలందరినీ అవమానించడమేనన్నారు. కేవలం టీడీపీకి అనుకూలంగా ఉన‍్న వారినే మహిళా పార‍్లమెంట్ సభ‍్యుల సదస్సుకు ఆహ్వానించడం దారుణమని, మహిళా సమస‍్యలపై పోరాటం చేస్తున‍్న సోనియాగాంధీ, మేధా పాట‍్కర్, బృందా కారత్ తదితరులను ఎందుకు ఆహ్వానించలేదని వారు ప్రశ్నించారు.
Advertisement
Advertisement