
మా పోలీసులు మంచివారు
కర్ణాటక పోలీసులు మంచివారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సామూహిక సెలవులపై వెళ్లరని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కితాబు ఇచ్చారు.
బెంగళూరు: కర్ణాటక పోలీసులు మంచివారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సామూహిక సెలవులపై వెళ్లరని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కితాబు ఇచ్చారు. వారి ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేతన పెంపు విషయమై పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించకపోవడంతో వచ్చేనెల 4న సామూహిక సెలవులపై వెళ్లనున్నట్లు పోలీసు సిబ్బంది రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శశిధర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విధంగా సమాధానమిచ్చారు.
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా ప్రతిధులతో మాట్లాడుతూ... రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయమై చర్చించడానికి ఢిల్లీ వచ్చానన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో శుక్రవారం భేటీ అయ్యి ఎన్నికల విషయమై చర్చిస్తానన్నారు. మంత్రిమండలి పునఃరచన, విస్తరణకు సంబంధించి కూడా చర్చిస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు.