రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
Jan 9 2017 1:02 PM | Updated on Nov 9 2018 4:36 PM
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్(20) బైక్ పై కళాశాలకు వస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Advertisement
Advertisement