వ్యభిచారం నడిపిన ఏడుగురి అరెస్ట్ | arrest of seven who ran prostitution | Sakshi
Sakshi News home page

వ్యభిచారం నడిపిన ఏడుగురి అరెస్ట్

Jul 28 2015 3:15 AM | Updated on Sep 3 2017 6:16 AM

చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురు బ్రోకర్లను అరెస్ట్ చేశారు.

తిరువొత్తియూరు: చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురు బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 మంది యువతులను విడిపించారు. పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశాల మేరకు చెన్నై జాఫర్‌ఖాన్‌పేట 15వ అవెన్యూలోని హెర్బల్ ఆయుర్వేద మసాజ్ సెంటర్‌లో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేడవాక్కంకు చెందిన రామనాథన్ (29)ను అరెస్టు చేశారు.
 
 ఇతని నుంచి చెన్నైకి చెందిన ఒక యువతిని  విడిపించారు. ఆరుంబాక్కంలో ఆన్‌లైన్ మసాజ్ నడుపుతున్న తిరువొత్తియూరుకు చెందిన కార్తీక్ (23)ను అరెస్ట్ చేశారు. అతని నుంచి కోల్‌కతాకు చెందిన యువతిని విడిపించారు. చెన్నై ఆర్కాడు రోడ్ కోడంబాక్కం లక్ష్మీ టవర్ రియా హెల్త్ కర్ స్పా అనే పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న తిరువాన్మియూరుకు చెందిన ఇస్మాయిల్‌ను (27)ను, కోయంబత్తూరుకు చెందిన నిరోషిణి (21)ని అరెస్టు చేసి జైలులో పెట్టారు. వీరి నుంచి చెన్నై కున్రత్తూరుకు చెందిన యువతిని విడిపించారు. చెన్నై ఎగ్మూర్ ఒకటవ వీధిలో బ్రైట్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా అనే మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న అమింజికరైకు చెందిన లక్ష్మి (22)ని అరెస్టు చేసి ఈమె నుంచి క ర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతిని విడిపించారు.
 
 చెన్నై స్పెన్సర్ ప్లాజా అన్నాసాలైలో నిర్విహ స్తున్న సన్‌షైన్ లగ్జరీ యూని సెక్స్ సెలూన్, స్పా యజమాని కన్నన్(25)ను అరెస్టు చేసి అతని నుంచి బెంగుళూరు, కోల్‌కతాకు చెందిన ఇద్దరు యువతులను విడిపించారు. చెన్నై వడపళణి సాలిగ్రామం అరుణాచలం రోడ్డులో ఉన్న ఫైర్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా అనే మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న చెన్నై వలసరవాక్కంకు చెందిన జయశ్రీ (25)ని అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ఐదుగురు యువతులను విడిపించారు. అరెస్టు చేసిన బ్రోకర్లను కోర్టులో హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు. వారి నుంచి విడిపించిన 11 మంది యువతులను మైలాపూరులోని మహిళా సురక్ష కార్యాలయంలో అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement