సీఐపై అన్నాడీఎంకే నేత ఫిర్యాదు | AIADMK man files complaint against police inspector arrested for graft | Sakshi
Sakshi News home page

సీఐపై అన్నాడీఎంకే నేత ఫిర్యాదు

Dec 23 2013 1:34 AM | Updated on Aug 21 2018 7:39 PM

అవినీతి కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్ థామ్సన్‌పై అన్నాడీఎంకే నేత ఒకరు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జేజే నగర్ పోలీసు

టీనగర్, న్యూస్‌లైన్: అవినీతి కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్ థామ్సన్‌పై అన్నాడీఎంకే నేత ఒకరు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జేజే నగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ థామ్సన్ శనివారం సాయంత్రం ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత రమేష్‌పై విజయ అనే మహిళ జేజే నగర్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. అందులో రూ.5 లక్షల రుణం తీసుకున్న రమేష్ ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి విచారణ జరిపిన థామ్సన్ విజయ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అన్నాడీఎంకె నేత రమేష్ వద్ద రూ.25 వేలు లంచంగా కోరారు. 
 
 శనివారం మధ్యాహ్నం పాడికుప్పం రోడ్డులో రమేష్ లంచం సొమ్ము అందజేశాడు. ఆ సమయంలో అక్కడ పొంచివున్న అడిషనల్ పోలీసు ఎసీప షణ్ముగ ప్రియ, డీఎస్పీ మురుగేశన్ ఇతర పోలీసు సిబ్బంది థామ్సన్‌ను చుట్డుముట్టారు. పోలీసులను చూడగానే పరారయ్యేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత తిరువళ్లూరు కోర్టులో హాజరుపరచిన ఇన్‌స్పెక్టర్ థామ్సన్ జనవరి మూడవ తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. 
 
 అన్నానగర్ 47వ డివిజన్ అన్నాడీఎంకే కోశాధికారి ఆనంద్‌కుమార్. ఈయన ఆదివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో థామ్సన్‌పై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఫిర్యాదు ఇచ్చేందుకు వీలు కాలేదు. దీని గురించి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 10 నవంబర్ 2006లో థామ్సన్ తనను ఒక వ్యాపారిగా పరిచయం చేసుకుని తన ఇంటిని బాడుగకు తీసుకున్నాడని దీంతో అన్నానగర్ వెస్ట్ బాలాజీ నగర్ పాడికుప్పం రోడ్డులో గల తన ఇంటిని బాడుగకు ఇచ్చానని తెలిపారు. అడ్వాన్సుగా రూ.50వేలు, ఐదువేలు బాడుగకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందన్నారు. 
 
 2008 జనవరిలో బాడుగ అందచేశారని రెండు సంవత్సరాల తరువాత అగ్రిమెంటును రెన్యువల్ చేసేందుకు వెళ్లగా అతడు పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా తెలిసిందన్నారు. తరువాత అతను బాడుగ ఇవ్వకుండా మోసగిస్తూ వచ్చాడన్నారు. దీనిగురించి పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి స్పెషల్ సెల్‌కు ఫిర్యాదు చేశానన్నారు. ఇలా వుండగా అతనికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలిసిందని దీంతోతానుకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని అన్నారు. ఆ కేసు వాపసు తీసుకోవలసిందిగా థామ్సన్ ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.ఈ సమయంలో థామ్సన్ అవినీతి కేసులో పట్టుబడ్డారని తెలిసి అందుచేత తన ఇంటిని తిరిగి అప్పగించాల్సిందిగా తాను ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement