మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా! | actress tamanna in love | Sakshi
Sakshi News home page

మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా!

Feb 21 2016 2:21 AM | Updated on Sep 3 2017 6:03 PM

మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా!

మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా!

నటి తమన్నా బాలీవుడ్ దర్శకుడు షాజిత్‌ఖాన్ ప్రేమలో పడ్డారని,త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.

నటి తమన్నా బాలీవుడ్ దర్శకుడు షాజిత్‌ఖాన్ ప్రేమలో పడ్డారని,త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తమన్న హిందీలో షాజిత్‌ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్‌వాలా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సన్నిహితం ప్రేమగా మారిందని,దీంతో తరచూ రహస్యంగా కలుసుకుంటూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని తమన్నా ఖండించారు.
 
 షాజిత్‌ఖాన్ దర్శకత్వంలో తాను హిందీలో హిమ్మత్‌వాలా చిత్రంలో నటించానని, ఆ చిత్రం పరాజయం పాలైనా తదుపరి హమ్‌షకల్స్ చిత్రంలో అవకాశం కల్పించారన్న గౌరవం షాజిత్‌ఖాన్‌పై ఉందని పేర్కొన్నారు. అలా తమ మధ్య స్నేహమే తప్ప ప్రేమ లేదని స్పష్టం చేశారు. షూటింగ్‌లో తనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, షాజిత్‌ఖాన్ అంటే ఆ కృతజ్ఞత కూడా ఉందని అన్నారు. ఇది తెలియని వారు తమ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. నా జీవితంలో బాహుబలి చిత్రాన్ని మరచిపోలేనని, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తనకు దేవుడిలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.
 
 తాను ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నటినని, మంచి కథా పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఇందుకు అదృష్టం కూడా తోడయ్యిందని, అందుకే మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా హిందీలోనూ వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి అక్కడ కూడా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఎంత కష్టపడి నటించినా మంచి కథల్లో నటించే అవకాశాల అమరాలన్నారు. కాలం కలసిరావాలని, అన్నిటికీ మించి అభిమానుల ఆదరణ చాలా అవసరం అని మిల్కీబ్యూటీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement