విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ గురువు విచక్షణ మరిచి తోటి ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడికి యత్నించాడు.
టీచర్ పై యాసిడ్ దాడికి యత్నం
Dec 29 2016 4:20 PM | Updated on Aug 17 2018 2:10 PM
నిర్మల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ గురువు విచక్షణ మరిచి తోటి ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఈ సంఘటన నిర్మల్‌లో గురువారం వెలుగు చూసింది. స్థానిక గౌతమ్ స్కూల్‌లో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ అహ్మద్ అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ యువతిని గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ దాడి చేయడానికి యత్నించాడు. ఈ ఘటనతో భయాందోళనలకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైస్ ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement