మహిళా ఎమ్మెల్యేకు అరుదైన బర్త్ డే గిఫ్ట్ | AAP Legislator Rakhi Birla Elected Delhi Deputy Speaker On Her Birthday | Sakshi
Sakshi News home page

మహిళా ఎమ్మెల్యేకు అరుదైన బర్త్ డే గిఫ్ట్

Jun 11 2016 9:21 AM | Updated on Apr 4 2018 7:02 PM

మహిళా ఎమ్మెల్యేకు అరుదైన బర్త్ డే గిఫ్ట్ - Sakshi

మహిళా ఎమ్మెల్యేకు అరుదైన బర్త్ డే గిఫ్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే రాఖీ బిర్లాకు శుక్రవారం పుట్టినరోజు సందర్భంగా అపురూపమైన కానుక లభించింది.

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే రాఖీ బిర్లాకు శుక్రవారం పుట్టినరోజు సందర్భంగా అపురూపమైన కానుక లభించింది. ఆమె తన పుట్టినరోజు నాడు ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. డిప్యూటీ స్పీకర్ పదవికి రాఖీ పేరును ప్రతిపాదించగా, సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. గతవారం రాజీనామా చేసిన బందన కుమారి స్థానంలో రాఖీ ఈ పదవికి ఎన్నికయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు తిరుగులేని మెజారిటీ ఉన్న ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement