ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి | 4 naxals killed in Bijapur last night by security forces | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి

Jul 11 2016 2:40 PM | Updated on Sep 4 2017 4:37 AM

కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.

బీజాపూర్: కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్కు 5 కిలో మీటర్ల దూరంలోని టుమ్నర్ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది.

మావోయిస్టులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్ అడిషనల్ ఎస్పీ మోహిత్ మార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దర్ని కమాండెర్ ఉకేష్, సెక్షన్ కమాండెర్ రాజుగా గుర్తించారు. మావోయిస్టుల నుంచి పోలీసులు రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement