భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు మిలీషియా సభ్యులు అరెస్ట్
Apr 15 2017 1:40 PM | Updated on Aug 20 2018 4:44 PM
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసారంపాడు గ్రామానికి చెందిన మడకం మందయ్య, దుర్గ బండి ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని జంగాలపల్లిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఇద్దరు మిలీసియా సభ్యులను గుర్తించిర వారిని అరెస్ట్ చేశారు. వీరిపై పలు స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement


