నేపాల్లో చిక్కుకున్న తమిళుల కోసం హెలికాప్టర్...! | 10 TN tourists stranded in Nepal, rescue efforts on | Sakshi
Sakshi News home page

నేపాల్లో చిక్కుకున్న తమిళుల కోసం హెలికాప్టర్...!

Jul 31 2016 9:58 AM | Updated on Sep 4 2017 7:13 AM

నేపాల్‌లో చిక్కుకున్న తమిళుల కోసం హెలికాప్టర్ను ఏర్పాటు చేయాలని తమిళ ప్రభుత్వం నిర్ణయించింది.

2.10లక్షల కేటాయింపు
 
చెన్నై: నేపాల్‌లో చిక్కుకున్న పది మంది తమిళుల్ని సురక్షితంగా ఢిల్లీకి చేర్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేయాలని జయలలిత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ. 2.10 లక్షలు కేటాయించింది. కాంచీపురం జిల్లా వాసులు పది మంది ఇటీవల ముక్తినాథ్ను సందర్శించేందుకు నేపాల్ వెళ్లారు. అయితే అక్కడ భారీ వర్షాలు, మంచు చరియలు విరిగి పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు తమిళవాసులు నేపాల్లో చిక్కుకుపోయారు. దాంతో వారు నేపాల్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను  సంప్రదించారు. సదరు అధికారులు వెంటనే జయలలిత ప్రభుత్వాన్నికి సమాచారం అందించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆమె ఆదేశించారు. 

ఢిల్లీలోని తమిళనాడు రాష్ట్రప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ పది మందిని సురక్షితంగా న్యూఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి చెన్నైకు తీసుకొచ్చేందుకు తగ్గిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement