జోష్‌ఫుల్‌గా జివా-పంత్‌ సెలబ్రేషన్స్‌..!

Ziva Dhoni and Rishabh Pant Celebrations at India vs Pakistan match - Sakshi

ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌ను భారత్‌ 86 పరుగులతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. ఈ సంబరాల్లో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌, మహేంద్రసింగ్‌ ధోనీ తనయ జివా ప్రత్యేకంగా నిలిచారు. మ్యాచ్‌ ముగియగానే ఈ ఇద్దరు భారత్‌ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ కేకలు వేశారు. ఫన్నీగా టీమిండియా విజయాన్ని పంత్‌-జివా సెలబ్రేట్‌ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రిషబ్‌ పంత్‌ భారత జట్టులోకి లేకపోయినప్పటికీ.. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు గాయం కావడంతో స్టాండ్‌బై ఆటగాడిగా అతను ఇంగ్లండ్‌కు వచ్చాడు. అతన్ని ఇంకా అధికారికంగా భారత జట్టులోకి తీసుకోలేదు.

 
జివా-సైఫ్‌ ఫొటో వైరల్‌
దాయాదులు భారత్‌-పాకిస్థాన్‌ పోరు సందర్భంగా మాంచెస్టర్‌లో పలువురు సినీ స్టార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌ సింగ్, సైఫ్‌ అలీఖాన్‌, మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితర స్టార్లు ఈ మ్యాచ్‌లో హల్‌చల్‌ చేశారు. ప్రస్తుతం లండన్‌లో ‘జవానీ జానేమన్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సైఫ్‌ అలీఖాన్‌, తన కోస్టార్‌ అలైయా ఫర్నిచర్‌వాలాతో కలిసి మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చారు. మ్యాచ్‌లో కోహ్లి సేనను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టారు. మ్యాచ్‌ అనంతరం మహేంద్రసింగ్‌ ధోనీ కూతురు జివా ధోనీతో సైఫ్‌ ఫొటో దిగాడు. క్యూట్‌ జివాతో సైఫ్‌ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top