అతడు నా ఫేవరేట్ బౌలర్: ప్రభాస్ | Zaheer Khan is One of my all time favorite bowler in Cricket: Prabhas | Sakshi
Sakshi News home page

అతడు నా ఫేవరేట్ బౌలర్: ప్రభాస్

Oct 15 2015 2:29 PM | Updated on Sep 3 2017 11:01 AM

అతడు నా ఫేవరేట్ బౌలర్: ప్రభాస్

అతడు నా ఫేవరేట్ బౌలర్: ప్రభాస్

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ను టీమిండియా ఆటగాళ్లు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు.

ముంబై: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ను టీమిండియా ఆటగాళ్లు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. జహీర్ మంచి బౌలర్ అని కితాబిచ్చారు. జట్టుకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. జహీర్ ఖాన్ ను శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ సందేశాలు పోస్ట్ చేశారు. ఎవరేం ట్వీట్ చేశారంటే....

హర్భజన్ సింగ్: జహీర్ ఉత్తమ బౌలర్. సహృదయుడు. నా సోదరుడికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. లవ్ యూ జకీ..

సురేశ్ రైనా: పెర్ ఫెక్ట్ జంటిల్ మన్. బిగ్ బ్రదర్. సరైన నిర్ణయం తీసుకున్నాడు. గుడ్ లక్ ఫర్ న్యూ ఇన్నింగ్స్

వీవీఎస్ లక్ష్మణ్: జహీర్ ఖాన్ తో ఆడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశం కోసం ఆడుతూ ఆటను ఆస్వాదించాం. అతడి క్రికెట్ కెరీర్ అద్భుతం

అనిల్ కుంబ్‌లే: అత్యుత్తమ ప్రతిభ చూపిన అద్భుత బౌలర్. అతడి భవిష్యత్ కెరీర్ బాగా సాగాలని కోరుకుంటున్నా

హీరో ప్రభాస్: క్రికెట్ లో నాకు బాగా ఇష్టమైన బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement