జహీర్‌ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ | Zaheer, five months in charge: Ganguly | Sakshi
Sakshi News home page

జహీర్‌ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ

Jul 15 2017 12:37 AM | Updated on Sep 5 2017 4:02 PM

జహీర్‌ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ

జహీర్‌ బాధ్యతలు ఐదు నెలలే: గంగూలీ

టీమిండియా బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైన జహీర్‌ ఖాన్‌ ఏడాదిలో 150 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని క్రికెట్‌ సలహా

కోల్‌కతా: టీమిండియా బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైన జహీర్‌ ఖాన్‌ ఏడాదిలో 150 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. దీంతో జహీర్‌ జట్టుకు పూర్తి స్థాయి బౌలింగ్‌ కోచ్‌ కాదనే విషయంలో స్పష్టత వచ్చినట్టయ్యింది. అటు బీసీసీఐ కూడా ఇప్పటికే జహీర్‌ నియామకం ఆయా పర్యటనల వారీగా సేవలందించే వరకేనని పేర్కొంది.

మరోవైపు తాను కేవలం వంద రోజుల వరకే సేవలందించగలనని జహీర్‌ స్పష్టం చేసినా... సీఏసీ ఒత్తిడి మేరకు తనతో 150 రోజుల ఒప్పందం కుదిరింది. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించిన అనంతరం సహాయక కోచ్‌లుగా జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌ల ఎంపిక అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. జహీర్‌ స్థానంలో పూర్తి స్థాయి కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను తీసుకోవాలని రవిశాస్త్రి గట్టిగా పట్టుబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement