లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ సాధించిన కాంస్య పతకం ఏకంగా స్వర్ణం కాబోతుందని ఇటీవల కథనాలు వెలువడిన విషయం..
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ సాధించిన కాంస్య పతకం ఏకంగా స్వర్ణం కాబోతుందని ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్ 60కేజీ ఫ్రీస్టరుుల్ విభాగంలో విజేతగా నిలిచిన టొగ్రుల్ అస్గరోవ్ (అజెర్‌బైజాన్) డోపీగా తేలినందుకు యోగికి ఈ అదృష్టం దక్కుతుందనేది కొందరి వాదన. అరుుతే తాజాగా ఈ పుకార్లకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యుడబ్ల్యు) తెర దించింది. అసలు అస్గరోవ్ ఎప్పుడు కూడా డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలలేదని స్పష్టం చేసింది.
‘అస్గరోవ్ యూడబ్ల్యుడబ్ల్యు డోపింగ్ నిరోధక పాలసీని ఎప్పుడూ అతిక్రమించలేదు. అతడిపై కథనాల్లో నిజం లేదు’ అని ట్వీట్ చేసింది. మరోవైపు కుడుఖోవ్ డోపీగా తేలడంతో యోగేశ్వర్ కాంస్య పతకం రజతంగా మారే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.