కాంస్య పతకం రేసులో రెజ్లర్‌ సుమీత్‌  | Wrestler Sumith win the bronze medal | Sakshi
Sakshi News home page

కాంస్య పతకం రేసులో రెజ్లర్‌ సుమీత్‌ 

Oct 21 2018 1:13 AM | Updated on Oct 21 2018 1:13 AM

Wrestler Sumith win the bronze medal  - Sakshi

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ సుమీత్‌ ఫ్రీస్టయిల్‌ 125 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం తలపడనున్నాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమీత్‌ సెమీఫైనల్లో 0–5తో చైనా రెజ్లర్‌ జెవె డింగ్‌ చేతిలో ఓడిపోయాడు.

అమర్‌వీర్‌ (కెనడా)–నికోలస్‌ ఎడ్వర్డ్‌ (అమెరికా) మధ్య మ్యాచ్‌ విజేతతో నేడు కాంస్యం కోసం జరిగే పోరులో సుమీత్‌ ఆడతాడు. భారత్‌కే చెందిన జితేందర్‌ (74 కేజీలు), పవన్‌ కుమార్‌ (86 కేజీలు) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... సోన్‌బా తనాజీ (61 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement