హీలీ విధ్వంసం.. మూనీ హాఫ్‌ సెంచరీ

Womens T20 World Cup Final: Alyssa Healy Half Century - Sakshi

మెల్‌బోర్న్‌: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా అలీసా హీలీ విధ్వంసం సృష్టిస్తోంది. ఓవర్‌కు కనీసం ఒకటి రెండు బౌండరీలు సాధిస్తూనే సింగిల్స్‌ తీస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. టీమిండియా పస లేని బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగ్‌ ఆసీస్‌కు కలిసొచ్చింది. 

ఈ క్రమంలో హీలీ 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించింది. హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన హీలో వరుస బౌండరీలతో హోరెత్తించింది. ముఖ్యంగా శిఖా పాండే వేసిన 11వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్‌ సాధించింది. దీంతో ఈ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు పిండుకుంది. అయితే రాధా యాదవ్‌ వేసిన 12వ ఓవర్‌లో హీలీ(75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దీంతో తొలి వికెట్‌​కు 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  మరోవైపు బెత్‌ మూనీ కూడా హీలీ అండతో ధాటిగా బ్యాటింగ్‌ సాగించింది. ఈ క్రమంలో మూనీ కూడా 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది తొమ్మిదో టీ20 హాఫ్‌ సెంచరీ కావడం విశేం. హీలికి 9 పరుగుల వద్ద, మూనీలకు 4 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను టీమిండియా ఫీల్డర్లు నేలపాలు చేశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top