
మీడియా సమావేశం లేకుండానే...
టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని రద్దు చేశారు.
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. జట్టు బంగ్లాదేశ్ బయల్దేరడానికి ముందు ఇది జరగాల్సి ఉంది. ఇటీవలి పరాజయాలు, ఫిక్సింగ్‌కు సంబంధించిన వివాదాల నేపథ్యంలో కెప్టెన్‌తో సహా ఏ ఒక్క ఆటగాడిని కూడా మీడియా ముందుకు పంపేందుకు బీసీసీఐ ఇష్ట పడటం లేదు.
రాబోయే టోర్నీ లేదా సిరీస్‌లలో జట్టు ప్రణాళికలు, వ్యూహాలపై సాధారణంగా కెప్టెన్ మాట్లాడటం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ రివాజును తోసిరాజంటూ భారత బోర్డు వ్యవహరించింది. ఆటగాళ్లకు సమయం లేకపోవడం వల్లే దీనిని రద్దు చేశామంటూ బీసీసీఐ వివరణ ఇచ్చింది. శుక్రవారం ఉదయం ధోని సేన బంగ్లాదేశ్‌కు బయల్దేరుతుంది.