వరల్డ్‌కప్‌ జట్టును గుర్తించాం: బ్యాటింగ్‌ కోచ్‌

We Identified The Core Of Players For World Cup, Vikram Rathour - Sakshi

ఆక్లాండ్‌: ఈ ఏడాది జరగబోయే వరల్డ్‌ టీ20కి సంబంధించి ప్రతీ జట్టు తమ సన్నాహకాల్లో మునిగి తేలుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఆ వరల్డ్‌కప్‌కు జట్టులో ఎలా ఉండాలనే దానిపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే వరల్డ్‌కప్‌ ఆడబోయే జట్టులోని సభ్యులను ఇప్పటికే గుర్తించామని అంటున్నాడు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌. చివరి నిమిషంలో ఏమైనా ఉంటే స్పల్ప మార్పులు తప్పితే జట్టులోని సభ్యుల పేర్లను పక్కకు పెట్టామన్నాడు. ‘ వరల్డ్‌ టీ20కి వెళ్లే భారత జట్టులోని సభ్యులను గుర్తించాం. (ఇక్కడ చదవండి: ‘ధోని సీటును అలానే ఉంచాం’)

వరుస పెట్టి సిరీస్‌లు ఆడుతూ ఉండటం వల్ల ఒక అంచనాకు వచ్చాం.  వారి పేర్లను నాతో పాటు మేనేజ్‌మెంట్‌ కూడా గుర్తించింది. జట్టు ఎలా ఉండాలనే విషయంపై స్పష్టత వచ్చింది. ఒకవేళ ఎవరైనా గాయపడినా, అప్పటికి తాము అనుకున్న ఏ క్రికెటరైనా పేలవమైన ఫామ్‌తో ఉన్నా మార్పులు ఉంటాయి. కానీ పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఇక ప్రస్తుత తరం  భారత క్రికెటర్ల గురించి విక్రమ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. ‘ ఈ కొత్త జనరేషన్‌ క్రికెటర్ల అసాధారణమైన నైపుణ్యంతో ఉన్నారు. వారు ఫార్మాట్‌కు తగ్గట్టు వారి ప్రదర్శనతో ఆకట్టుకోవడాన్ని నేను గుర్తించా. న్యూజిలాండ్‌లో భారత క్రికెటర్ల ఆట తీరు అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌లపై రాథోడ్‌ ప్రశంసలు కురిపించాడు. వీరి జట్టు అంచనాలకు తగ్గట్టూ ఆడుతూ విజయాల్లో పాలుపంచుకోవడం సంతృప్తిగా ఉందన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top