క్రికెట్‌లో నువ్వు నిజమైన చాంపియన్‌: కోహ్లి

Virat Kohli Posts Heartfelt Message for Steyn - Sakshi

గయానా: దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించాడు. పేస్‌ మెషీన్‌గా గుర్తింపు పొందిన స్టెయిన్‌ టెస్టు రిటైర్మింట్‌ సంతోషమయం కావాలని ఆకాంక్షించాడు. ‘ క్రికెట్‌ ఆటలో నువ్వు నిజమైన చాంపియన్‌. నీ టెస్టు రిటైర్మెంట్‌ మరింత ఆనందమయం కావాలి పేస్‌ మెషీన్‌’ అని కోహ్లి తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో 2008 నుంచి 2010 వరకూ ఆర్సీబీ తరఫున ఆడిన స్టెయిన్‌.. 2019 సీజన్‌లో కూడా అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్సీబీ కెప్టెన్‌ అయిన కోహ్లితో కలిసి ఆడిన అనుభవం స్టెయిన్‌ది. దాంతో సహచర ఆటగాడికి కోహ్లి అభినందులు తెలియజేశాడు. (ఇక్కడ చదవండి: స్టెయిన్‌ ‘టెస్టు’ ముగిసింది!)

ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్‌గా తనదైన ముద్ర వేసిన డేల్‌ స్టెయిన్‌ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. గత కొంతకాలంగా తరచూ గాయాలబారిన పడిన 36 ఏళ్ల స్టెయిన్‌ ఇకపై వన్డేలు, టి20లకు పరిమితం అవుతానని చెప్పాడు.  93 టెస్టుల్లో స్టెయిన్‌ 439 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టెయిన్‌... ఓవరాల్‌గా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంతో తన కెరీర్‌ ముగించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top