ఆగస్టు 12న చెస్ చాంపియన్‌షిప్ | tsca chess championship on august 12th | Sakshi
Sakshi News home page

ఆగస్టు 12న చెస్ చాంపియన్‌షిప్

Jul 30 2016 3:01 PM | Updated on Sep 4 2017 7:04 AM

తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 12న తెలంగాణ రాష్ట్ర యూత్ (అండర్-25) చెస్ చాంపియన్‌షిప్ జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 12న తెలంగాణ రాష్ట్ర యూత్ (అండర్-25) చెస్ చాంపియన్‌షిప్ జరుగనుంది. కేవలం రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాసవి భవన్‌లో జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం టీఎస్‌సీఏ విడుదల చేసింది.

 

ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు అస్సాంలో జరిగే జాతీయ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌కు ఎంపికవుతారు. స్విస్‌లీగ్ పద్ధతిలో ఏడు రౌండ్లపాటు పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం నల్గొండ జిల్లా చెస్ సంఘం కార్యదర్శి కె. కరుణాకర్ (9985423823)ను సంప్రదించవచ్చు.

 

Advertisement
 
Advertisement
Advertisement