చటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడంతో జోహన్నస్ బర్గ్ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు 320 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది.
జోహనెస్ బర్గ్ లో పట్టు బిగించిన భారత్
Dec 20 2013 9:50 PM | Updated on Sep 2 2017 1:48 AM
చటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడంతో జోహన్నస్ బర్గ్ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు 320 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. ధావన్ 15, విజయ్ 39 పరుగులు చేసి అవుటయ్యారు. ఆతర్వాత కోహ్లీతో కలిసి పూజారా భారత్ జట్టును ముందుకు నడిపించారు. పూజారా 135, కోహ్లీ 77 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులకే ఆలౌటయ్యారు. ఇషాంత్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్ కు , వెటరన్ ఆటగాడు జహీర్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. సౌతాఫ్రికా ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్ (68), ఆమ్లా(36), పీటర్ సన్ (21), ఫిలిండర్ (59) పరుగుల మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేదు. మరో భారత్ బౌలర్ మహ్మద్ సమీకి రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 280 పరుగులకు ఆలౌటైంది.
Advertisement
Advertisement