టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ ఆవిష్కరణ 

Tokyo 2020 reveals Olympic torch design - Sakshi

టోక్యో: వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న టోక్యో నగరంలో బుధవారం టార్చ్‌ను ఆవిష్కరించారు. ఐదు రేకులతో ఉండే చెర్రీ బ్లాసమ్‌ పువ్వు ఆకారం ఈ టార్చ్‌ పైభాగంలో కనిపిస్తుంది. బంగారు వర్ణంలో ఉన్న ఈ టార్చ్‌ పొడవు 28 అంగుళాలు, బరువు 1.2 కిలోలు. దీన్ని అల్యూమినియం లోహంతో తయారు చేశారు.

2011లో సంభవించిన భూకంపం, సునామీ బాధితుల కోసం తాత్కాలికంగా ఇళ్లను నిర్మిం చగా వచ్చిన వేస్టేజ్‌ అల్యూమినియం లోహం తో టార్చ్‌ రూపొందింది. టోక్యోలో ఈ టార్చ్‌ పరుగు పెట్టనున్న నేపథ్యంలో నగర వీధుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. మార్చి 26న టార్చ్‌ రిలే మొదలవుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top