పిచ్‌ తప్పేమీ లేదు: మురళీ విజయ్‌ | There's nothing wrong pitch: Murali Vijay | Sakshi
Sakshi News home page

పిచ్‌ తప్పేమీ లేదు: మురళీ విజయ్‌

Mar 2 2017 12:04 AM | Updated on Sep 5 2017 4:56 AM

తొలి టెస్టులో తమ జట్టు ఘోర పరాజయంలో పిచ్‌ పాత్ర ఏమీ లేదని భారత క్రికెటర్‌ మురళీ విజయ్‌ అభిప్రాయపడ్డాడు.

బెంగళూరు: తొలి టెస్టులో తమ జట్టు ఘోర పరాజయంలో పిచ్‌ పాత్ర ఏమీ లేదని భారత క్రికెటర్‌ మురళీ విజయ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్‌ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ ఇచ్చిన నివేదికతో అతను విభేదించాడు. ‘పుణే వికెట్‌ నాసిరకంగా ఏమీ లేదు. తొలి బంతి నుంచే అది బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసిరింది.

క్రికెటర్లుగా మేం ఎప్పుడూ బ్యాటింగ్‌ పిచ్‌లపైనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పిచ్‌లపై కూడా ఆడాల్సి ఉంటుంది. మా సమర్థతను, సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించే ఇలాంటి వికెట్‌లపై ఆడటం కూడా మంచిది. బెంగళూరులో ఎలాంటి పిచ్‌ ఎదురవుతుందో చూడాలి’ అని విజయ్‌ వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement