నల్గొండ జట్టు విజయం | The team's success in Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండ జట్టు విజయం

Sep 22 2013 12:07 AM | Updated on Sep 19 2018 6:31 PM

అంతర్ జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో నల్గొండ జట్టు విజయం సాధించింది. జి.పుల్లారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన లీగ్ పోటీల్లో నల్గొండ 59-28తో హైదరాబాద్‌పై నెగ్గింది.

 జింఖానా, న్యూస్‌లైన్: అంతర్  జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో నల్గొండ జట్టు విజయం సాధించింది. జి.పుల్లారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన లీగ్ పోటీల్లో నల్గొండ 59-28తో హైదరాబాద్‌పై నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి నల్గొండ 26-10తో ఆధిక్యం సాధించింది. అనంతరం తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ జట్టుకు మహబూబ్‌నగర్‌పై విజయం దక్కింది.

44-13తో ఆ జట్టును మట్టికరిపించింది. మొదటి అర్ధభాగంలో 30-7తో హైదరాబాద్ పైచేయి సాధించగా ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించింది. అలాగే ఆదిలాబాద్ జట్టుపై నల్గొండ 40-36తో గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 23-13తో నల్గొండ జట్టు ముందంజ వేసింది. రెండో అర్ధభాగ ంలో ఆదిలాబాద్ జట్టు ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆఖరి నిమిషంలో నల్గొండ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో గట్టెక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement