రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్‌లో భాగంగా శుక్ర, శనివారాల్లో లాన్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్‌లో భాగంగా శుక్ర, శనివారాల్లో లాన్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు అండర్-14, 17 స్కూల్ విద్యార్థులు మాత్రమే అర్హులని ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రమేశ్ రెడ్డి తెలిపారు. అనంతరం 8న షటిల్ బ్యాడ్మింటన్, 10, 11 తేదీల్లో స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తిగల బాలబాలికలు తమ పాఠశాల నుంచి బోనఫైడ్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి. వివరాలకు 93469-84505 ఫోన్‌నంబర్లో సంప్రదించవచ్చు.
28న చెస్ టోర్నీ
వన్‌గోల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 28న అండర్-14 చెస్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. మణికొండలోని అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తామని టోర్నీ ఆర్గనైజర్ ఇనగంటి జ్యోతిగణేష్ తెలిపారు. మరిన్ని వివరాలకు 93472-13806 ఫోన్‌నంబర్లో సంప్రదించవచ్చు.