హాకీ కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానం | telangana hockey invites coaching applications | Sakshi
Sakshi News home page

హాకీ కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

Aug 5 2017 10:24 AM | Updated on Sep 11 2017 11:21 PM

తెలంగాణ రాష్ట్ర హాకీ జట్టు కోచ్‌ పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ హాకీ సంఘం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హాకీ జట్టు కోచ్‌ పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ హాకీ సంఘం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫుల్‌ టైమ్‌ హాకీ కోచ్‌గా పనిచేయుటకు అనుభవం, నైపుణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కోచ్‌ ఎంపికలో సీనియర్‌ జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిం చి, ఎన్‌ఐఎస్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధనలను పరిగణనలోకి తీసుకోనుంది.

 

40 ఏళ్లు కలిగి ఆంగ్ల భాషా ప్రావీ ణ్యం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న అభ్యర్థులు ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు తమ  బయోడేటాను ఈనెల 10 లోగా  telangana.hockey@hockeyindia.orgలో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement