తస్కీన్, సన్నీలకు గ్రీన్‌సిగ్నల్ | Taskin and Sunny cleared to bowl after remedial work | Sakshi
Sakshi News home page

తస్కీన్, సన్నీలకు గ్రీన్‌సిగ్నల్

Sep 24 2016 12:23 PM | Updated on Sep 4 2017 2:48 PM

తస్కీన్, సన్నీలకు గ్రీన్‌సిగ్నల్

తస్కీన్, సన్నీలకు గ్రీన్‌సిగ్నల్

బంగ్లాదేశ్ బౌలర్లు తస్కీన్ అహ్మద్, అరాఫత్ సన్నీలకు ఐసీసీ నుంచి తీపి కబురు అందింది.

దుబాయ్: బంగ్లాదేశ్ బౌలర్లు తస్కీన్ అహ్మద్, అరాఫత్ సన్నీలకు ఐసీసీ నుంచి తీపి కబురు అందింది. బౌలింగ్ వేసేటప్పుడు వారి యాక్షన్ ఐసీసీ నిబంధనలను అనుగుణంగా లేదని ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో వాళ్లు బౌలింగ్ చేయకుండా గతంలో ఐసీసీ నిషేధం విధించింది. వారిద్దరికి అనేక పరీక్షలు నిర్వహించిన ఐసీసీ.. ప్రస్తుతం వారి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగానే ఉందని తేల్చింది.

 

దాంతో వాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేసేందుకు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా వారి బౌలింగ్ యాక్షన్‌పై సందేహాలు తలెత్తాయి. దాంతో చెన్నైలో తొలిసారి వారికి పరీక్షలు నిర్వహించారు. తాజాగా సెప్టెంబర్ 8న బ్రిస్బేన్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం వాళ్లు బౌలింగ్ వేసేటప్పుడు తమ మోచేతిని 15 డిగ్రీలకు మించి వంచడం లేదని తేలింది. దాంతో ఐసీసీ వారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement