సురేశ్‌ రైనా అరుదైన ఘనత | Suresh Raina Creates New Record in T20 | Sakshi
Sakshi News home page

Mar 9 2018 11:35 AM | Updated on Mar 9 2018 11:35 AM

Suresh Raina Creates New Record in T20 - Sakshi

సురేశ్‌ రైనా

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిదహాస్‌ ట్రోఫిలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో సిక్సు బాది అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన మూడో భారత ఆటగాడిగా కొనసాగుతున్న రైనా తాజా సిక్సుతో 50 సిక్సుల ఘనతను సొంతం చేసుకున్నాడు.

27 బంతుల్లో 28 పరుగులు చేసిన రైనా ఇందులో ఒక ఫోరు, సిక్సు బాదాడు. భారత ఆటగాళ్లలో 74 సిక్సులతో యువరాజ్‌ తొలి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ(69) సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌ జాబితాలో క్రిస్‌ గేల్‌, మార్టిన్‌ గప్టిల్‌లు 103 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement