ఐపీఎల్‌: అలెక్స్‌ హేల్స్‌ అరంగేట్రం | Sunrisers Won the toss and Eleceted to Bat Against Rajasthan | Sakshi
Sakshi News home page

Apr 29 2018 3:51 PM | Updated on Apr 29 2018 5:52 PM

Sunrisers Won the toss and Eleceted to Bat Against Rajasthan - Sakshi

అలెక్స్‌ హేల్స్‌

జైపూర్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ వైపు మొగ్గు చూపాడు. ఇక సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో వచ్చిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్‌ నబీ స్థానంలో ఈ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇక రాజస్తాన్‌ జట్టులో ఇద్దరు యువఆటగాళ్లు ఇష్‌ సోది, మహీపాల్ లోమ్మెర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నారు.

వరుసగా గత రెండు మ్యాచ్‌లను గెలిచిన సన్‌రైజర్స్‌ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తమ బలమైన బౌలింగ్‌తో ఎంతటి తక్కవ స్కోర్‌నైనా కాపాడుకుంటోంది. ఇక రాజస్తాన్‌ ముంబైపై స్టన్నింగ్‌ విజయాన్నందుకుంది. ఈ విజయాన్నే పునరావృత్తం చేయాలని భావిస్తోంది.

తుదిజట్లు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : శిఖర్‌ ధావన్‌, అలెక్స్‌ హేల్స్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), మనీశ్‌ పాండే, షకీబ్‌ అల్‌ హసన్‌, యుసఫ్‌ పఠాన్‌, వృద్దిమాన్‌ సాహా, రషీద్‌ఖాన్‌, బసిల్‌ థంపి, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ

రాజస్తాన్‌ రాయల్స్‌: అజింక్యా రహానే(కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, సంజు శాంసన్‌, బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌, కృష్ణప్ప గౌతమ్‌‌, జోఫ్రా ఆర్చర్‌, మహీపాల్ లోమ్మెర్, ధావల్‌ కులకర్ణి, జయదేవ్‌ ఉనాద్కట్‌, ఇష్‌ సోది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement