బెన్‌ స్టోక్స్‌కు అరుదైన గౌరవం

Stokes Bags Professional Cricketers Association Award - Sakshi

లండన్‌: ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదిగాను ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఇచ్చే ఫ్రొఫెషనల్‌ క్రికెటర్ల అసోషియేషన్‌(పీసీఏ)అవార్డును స్టోక్స్‌ దక్కించుకున్నాడు. ఈ మేరకు స్టోక్స్‌ పీసీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయార్‌ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఈసీబీ తెలిపింది. ప్రధానంగా వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో స్టోక్స్‌  ముఖ్య భూమిక పోషించాడు. మరొకవైపు యాషెస్‌ సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కూడా స్టోక్స్‌ది ప్రధాన పాత్ర. 

యాషెస్‌ మూడో టెస్టులో స్టోక్స్‌ అజేయంగా 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌ చిరస్మరణీయమైన విజయం సాధించడానికి సహకరించాడు. దాంతో స్టోక్స్‌ను పీసీఏ అవార్డును చేజిక్కించుకోవడం సులభతరమైంది. దీనిపై స్టోక్స్‌ మాట్లాడుతూ.. ‘ ఈ అవార్డును తీసుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. మీరు నాకు ఓటేసి నన్ను అత్తున్నత స్థానంలో నిలబెట్టారు’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు. ఇక వుమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సమ్మర్‌ అవార్డును ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫియా ఎక్లిస్టోన్‌ రెండోసారి దక్కించుకోగా, టామ్‌ బాంటాన్‌ యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఇక క్రిస్‌ వోక్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌లకు వరుసగా వన్డే, టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు దక్కాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top