
గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతోన్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనానికి ముందు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా మడమ గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్న 34 ఏళ్ల స్టెయిన్ ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించాడు.
‘ఇప్పుడు 12 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతున్నా. కానీ టెస్టు మ్యాచ్‌కు ఇది సరిపోదు. అందుకే ఐపీఎల్‌లో పాల్గొనకుండా కౌంటీల్లో హాంప్‌షైర్ తరఫున బరిలో దిగాలనుకుంటున్నా. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్తా’ అని స్టెయిన్ అన్నాడు.