చాంప్స్‌ సృజన్‌ కీర్తన్, అద్వైత | srujan keertan wins chess title | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ సృజన్‌ కీర్తన్, అద్వైత

Jan 22 2018 10:58 AM | Updated on Jan 22 2018 10:58 AM

srujan keertan wins chess title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చెస్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు ఎస్‌. సృజన్‌ కీర్తన్, అద్వైత శర్మ పురుషుల, మహిళల విభాగాల్లో చాంపియన్‌లుగా నిలిచారు. తద్వారా జాతీయ చెస్‌ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు పురుషుల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఎం. విశ్వనాథ్‌ (కరీంనగర్‌), డి. నాగ శశాంక్‌ (మూడో స్థానం, రంగారెడ్డి), వెటరన్‌ ప్లేయర్‌ వి. దివాకర్‌ (నాలుగో స్థానం, హైదరాబాద్‌), పి. షణ్ముఖ తేజ (ఐదో స్థానం, హైదరాబాద్‌) కూడా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.

మహిళల విభాగంలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన కె. అద్వైత శర్మ, పి. యజ్ఞప్రియ (హైదరాబాద్‌), వి. చైతన్య (రంగారెడ్డి), టి. విజ్ఞశ్రీ (రంగారెడ్డి), టి. జయశ్రీ తరణి ప్రియ (రంగారెడ్డి) తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి భువనేశ్వర్‌లో జాతీయ స్థాయి చెస్‌ టోర్నీ జరుగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement